Tuesday, October 12, 2010

సరస్వతి నమస్తుభ్యం


శ్రీ ప్రచురణలు పతాకంపై రాజమండ్రికి చెందిన విద్యావేత్త, విదుషీమణి ఇరగవరపు శ్రీపద్మావతి (ప్రిన్సిపాల్, మహావీర్ విద్యానికేతన్) సంకలనం చేసిన సరస్వతీ స్తుతులు, ప్రస్తావనల సమాహారం ఇది. పండితులనుంచి పామరుల వరకూ అందరికీ ఆ చదువుల తల్లి అనుగ్రహాన్ని చేకూర్చే ఈ మంచి ప్రయత్నం ద్వారా శ్రీపద్మావతి పలువురు ప్రముఖుల మన్ననలు అందుకున్నారు. మన పోయెట్స్ డయాస్ వీక్షకుల సౌకర్యార్థం ఈ సరస్వతీ నమస్తుభ్యం పుస్తకంలోని విషయాలను ప్రత్యేక పేజీగా పొందుపరుస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తూ....           సైట్ అడ్మినిస్ట్రేటర్


Friday, September 24, 2010

అన్నీ నువ్వే

నువ్వు...
నిస్సారమైన నా జీవితాన్ని
కలకంటే మధురంగా మార్చావు
లక్ష్యం లేని నా బతుక్కి
చుక్కానివై నను నడిపించావు
మోడువారిన నా ఆశలపై
వర్షమై కురిశావు
శిథిలమైన మనోవీధిలో
హర్షమై మెరిశావు
నిద్రాణంగా ఉన్న నా ఆశయాలను
తిరిగి మేల్కొలిపావు
నాలోని నిర్వేదాన్ని
కడవరకూ పారద్రోలావు
నా ప్రతి అడుగునా
వీడని తోడువై నడిచావు
తరగని స్ఫూర్తివై
నను నడిపించావు
నా హృదయానికి
స్పందనవయ్యావు
నా సంకల్పానికి
ఇంధనమయ్యావు
ఇంత చేసిన నువ్వు....
నాకు ఇన్నయిన నువ్వు...
నేను నీకేమవుతానని
నిలదీస్తే....?
మన అనుబంధం ఏమిటని
ప్రశ్నిస్తే...?
ఏమని చెప్పను
ఎలా వివరించను?
నాకన్నీ నువ్వేనని
ఎలా నమ్మించను...
నువ్వే లేనినాడు
నాకేదీ లేదని
నీకెలా తెలియజెప్పను?
                                      -దీక్షిత్

Sunday, September 12, 2010

గడ్డి

కొన్ని మూగ జీవాలే కాదు
కొందరు మనుషులు కూడా
"గడ్డి" తింటారు
కానీ.....
పశువులు తినేది
"ఆకలి" తీర్చే గడ్డి
మనుషులు తినేది
లంచమనే గడ్డి
         - ఆకొండి రవి

చిరిగిన కాగితం

బడా బడా
పదాలను
బరువైన కలంతో
వ్రాయాలని యత్నించి
నా కవనోద్వేగానికి
నలిగి
చిరిగింది... ఆ కాగితం
                - ఆకొండి రవి

అగాధం

తవ్వితే ఏర్పడేది...
మట్టిలో
మనుషుల మనస్సులో
                    -ఆకొండి రవి

Thursday, September 9, 2010

జీవితం

బాల్యంలో అశ్రద్ధ
యవ్వనంలో తపన
కౌమారంలో తాపత్రయం
వృద్ధాప్యంలో నిరాశ
శైశవ దశలో విషాదం
               - ఆకొండి రవి

Tuesday, September 7, 2010

Light of Life


I never think that

there would be a better time like this

But you've come into my life

and taken away all my sorrows and depressions

I have found true love at last

My sadness is a thing of the past now

My days of emptiness gone for good

Because you fill happiness in my heart

Like an angel or a goddess

You've opened a window

and  shown me the real light of life

my love will burn bright for u
                                         - Deekshit

Friday, September 3, 2010

సూదంటురాయిలా...

నిప్పులు చిమ్ముకుంటూ
నింగికెగిరే రాకెట్లా
నేను అంతరిక్షం వైపు
దూసుకు పోతున్న వేళ...
అన్ని దిక్కుల్లోనూ
నువ్వే కనిపించావు
ఆనాడు నీ నగుమోము
సూదంటు రాయిలా
నన్ను ఆకర్షించింది
ఏదో శక్తి ప్రబలమై ఆవహించింది
గురుత్వాకర్షణను మించిన
ఆ సమ్మోహన శక్తి
నన్ను అమాంతం ఆకట్టుకుంది
రెట్టింపు వేగంతో
నేనిపుడు
భూమికి దూసుకొస్తున్నాను...
నన్నింతగా ఆకర్షించిన
నీవు నాకిపుడు కనిపించవేం?
రాలిన ఉల్కా శకలంలా
తెగిన గాలిపటంలా
నేలకు ఉరికివస్తున్న
నాకు ..
దారమైనా ఆధారమైనా
నీవేనన్న సంగతి ఆదమరిస్తే
ప్రియతమా నాకేదీ గతి...
ఆకర్షణతో లాగేసి...
ఆశ్రయం ఇవ్వకుండా
వదిలేస్తే...
ఏ అధో పాతాళానికి.
జారిపోతానో అని
భయంగా ఉంది....
మరి... కరుణిస్తావా...
చేయందిస్తావా?!
               - దీక్షిత్

Monday, August 30, 2010

నేనెవర్ని?

ప్రియా...
నన్ను చూసిన తొలి క్షణంలో
నీ కళ్ళలో
మెరిసిన ఆనందవీచిక
నాతో మాట్లాడే ప్రతి నిమిషం
నీలో కనిపించే ఉత్తేజం
నాతో ఉన్నపుడు
వెల్లివిరిసే ఆత్మీయత
ప్రేమను కొసరే ఆప్యాయత
ఇవన్నీ చూస్తుంటే...
నేను నీవాడినని
నమ్మకంగా అనిపిస్తుంది...
అంతలోనే...
ఎందుకో
నన్ను ఎడం చేస్తున్నావనిపిస్తుంది
చుట్టంలా చూస్తున్నావని తోస్తుంది
నువ్వు నాకు దూరమౌతావన్న
భయం నన్ను ఆవహిస్తుంది
అదే జరిగితే...
ఆ ఊహే భయానకంగా తోస్తుంది
బతకాలన్నవాంచ నశిస్తుంది
ప్రియతమా...
అతిథులు...
హితులు, స్నేహితులూ
ఎందరో ఉంటారు....
నేనూ అందర్లో ఒకడ్నా...?
అనే అనుమానమూ వేధిస్తుంది
మరు తరుణంలోనే
నేను నీకో ప్రత్యేకమైన వ్యక్తినని
విశ్వాసం కలుగుతుంది
ప్రియతమా...
సొంత మనుషుల మధ్య
ఎందుకీ అంతరం?
నా మనో మందిరంలో
నువ్వో దేవతవైనప్పుడు
కనీసం నీ పాదాల చెంతనైనా
నాకు చోటుండదా ??

తెల్ల గులాబీ

నా మనసు పూదోటలో
వెల్లి విరిసింది ఓ తెల్ల గులాబీ
ఆ సుగంధాలకు
గులామ్ నై
కడ్తున్నా మెరూన్ మాలల్ని
ఇస్తున్నా సలామ్ సుమాల్ని
ఆ సాన్నిధ్యం
నాకొక దివ్యానుభూతి
ఆ పరిమళంలో
అనిర్వచనీయ శాంతి
అందం... సౌకుమార్యం
అన్నిటినీ మించిన
ఆ పూరేకుల తెల్లదనం
ఆ స్వచ్చతలోని ప్రశాంతత
ఆ మెత్తదనంలోని మమకారం
ఆ దగ్గరితనంలోని ఆత్మీయత
లాలిత్యానికి మారుపేరైన ఆడతనం
అభిజాత్యం చూపే జాణతనం
తాజాదనంలోని ప్రేమగుణం
అన్నీ కలగలిసిన ఓ అద్భుతం
ఆమెతో నా అనుబంధం
అదో అందమైన అనుభవం
                        - దీక్షిత్

Friday, August 27, 2010

ఎప్పటికైనా...

నేస్తమా..
నీ గురించి
నేనెన్ని సార్లు తలచుకున్నానో
నీ గురించి
నేనెంతగా ఎదురు చూశానో,,
ఎలా చెబితే
నీకు అర్ధం అవుతుంది?
నిన్ను తలుస్తూ
ఊహల అగాధంలోకి
నేనలా జారి పడిపోయిన వేళ
నన్ను నేను మిస్సయిన విషయం
నీకెలా అవగతమయ్యేది ?
నిన్ను పదేపదే
గుర్తు చేస్తున్న నా మదిని
మరల్చేందుకు...
ఆకాశంలో చుక్కల్ని సైతం
లెక్క పెట్టిన విషయం
నీకు తెలిసేదెలా...
చుక్కల లెక్క పూర్తైనా
అనంతమైన నీ ఊసులు మాత్రం
నన్ను వీడలేదని
అసలెన్నడూ
అవి నా మదిని వీడిపోవని
నీకు ఇప్పటికైనా తెలుస్తుందా..
అసలెప్పటికైనా తెలుస్తుందా....??
                            -దీక్షిత్

Wednesday, August 25, 2010

కలలో కూడా...

ప్రియతమా...
కలలో కూడా
ఊహించలేని
అదృష్టాన్నిచ్చావు
నీ స్నేహ పరిమళంతో
నన్ను పరవశింపజేశావు
నీ అనురాగంతో
నాకొక
కొత్త జీవితాన్ని ప్రసాదించావు
నీ చెలిమితో
ఈ శిలను
శిల్పంగా మలిచావు
హృదయమా...
కలలో కూడా
ఈ అదృష్టాన్ని దూరం చేయకు
కలలో కూడా
నన్ను వీడి వెళ్ళకు
కలలో కూడా
నన్ను మళ్ళీ శిలగా మార్చేయకు
చివరికి...
కలలో కూడా
ఈ జీవితాన్ని కాలరాయకు
                                     - దీక్షిత్

Tuesday, August 24, 2010

నీవల్లే...

ఒకవేళ...
ప్రేమంటే ఏమిటో
నాకు తెలిసిందీ అంటే
అది నీవల్లే
ఒకవేళ
మనసు భాష నాకు
తెలిసొచ్చిందంటే
అది నీవల్లే
ఒకవేళ
ఎదుటి వ్యక్తిని
అర్ధం చేసుకోవడం
అలవడిందంటే... నీవల్లే
అందమైన భావుకతకు
అపురూపమైన భావనలకు
అలవి కాని ఆశలకు
అంతులేని ఆవేశానికి
అర్ధం లేని కోపానికి
హద్దుల్లేని ప్రేమాభిమానాలకు
దేనికి నే గురైనా....
నేనెలా ప్రవర్తించినా...
ప్రియతమా...
అది నీవల్లే
ఎందుకంటే
ఈ క్షణం నుంచి
నేనంటూ లేను
నువ్వే నా సర్వస్వం
నువ్వే నా సమస్తం
నువ్వే నా ఆద్యంతం
                - దీక్షిత్

Monday, August 23, 2010

"కిరి కట్"

ఆ రోడ్డు మీద
వయోలెన్సీ కుర్రాళ్ళు
ధర్మదేవత
నాలుగు పాదాలూ
విరిచి
మూడింటిని వికెట్లుగా
మిగిలిన ఒకటిని
బ్యాట్ గా చేసి
సమాజాన్ని
"చెలగాటం" అనే
క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు
                      - ఆకొండి రవి, కాట్రేనికోన

అపురూపం

నేను చాలా చాలా
అదృష్టవంతుడ్ని సుమా
ఈ ప్రపంచంలో మహా గొప్పవి...
ఎంతో అందమైనవి...
మరెంతో ఉన్నతమైనవి...
ఎన్నో ఉన్నా
వాటిని ఊహలో పొంది తృప్తి పడాలే తప్ప
తాకే అర్హత.. చూసే అదృష్టం కూడా లేదు
అది వెన్నెల్లో తాజ్ మహల్ కావచ్చు...
మానస సరోవరంలో రాజహంస కావచ్చు
కోహినూర్ వజ్రం కావచ్చు
లేదంటే చందమామలోని కుందేలు కావచ్చు
కానీ...
ఆ కోవకే చెందిన నువ్వు
నా మనిషిగా మసిలిన
ఆ అపురూప క్షణాలు
నాకొక జీవితకాలపు
అద్భుతాన్ని పంచాయి
మరో జన్మకు సరిపడా
తీయటి అనుభూతి మిగిల్చాయి
నీ స్పర్శలో వెచ్చదనం
నీ సాన్నిధ్యంలో ఆనందం
నీ మాటలోని మార్దవం
నీ మనసులోని మంచితనం
నీవు పంచిన ప్రేమగుణం
నీవు చూపిన మమకారం
నీలోని ఆత్మీయత
నీదైన అనురాగం....
ఇవన్నీ నాలో
సదా సజీవంగా నిలుస్తాయి
ఎప్పటికప్పుడు నన్ను ఉత్తేజపరుస్తాయి
ప్రియతమా ....
నువ్వు
నా దానివని గుర్తు చేస్తాయి
నువ్వెంతటి అపురూపమో
నా మనసుకు తెలియ పరుస్తాయి
మన బంధమెంతటి
అతిశయమో...
ఈ గుర్తులు వివరిస్తాయి
                   -దీక్షిత్

Sunday, August 22, 2010

మజిలీ

ప్రియతమా...
అందమైన ప్రకృతి కాన్వాసు మీద
అరుదైన రంగులద్దినట్టుగా ఉంది
నిన్ను చూస్తుంటే...
ఈ ప్రపంచానికి నువ్వు కేవలం
ఓ వ్యక్తివి కావచ్చు
కానీ నిన్నే ప్రేమించే నాకు
నువ్వే ప్రపంచమయ్యావు
ఆశలు రేపావు, ఆలోచన నేర్పావు
జీవితంపై అభిలాష పెంచావు
అడుగడుగునా స్ఫూర్తివై నిల్చావు
కొన్నాళ్ళ క్రితం
నాకేమీ కాని నువ్వు
ఇవాళ అన్నీ అవుతుంటే
ఎందుకో ఒకింత ఆశ్చర్యంగా ఉంది
ఇంతలోనే ఏమిటీ వింత.. అనిపిస్తోంది
ఇలా ఆలోచిస్తున్న
నా మనసుకు అంతలోనే
ఒక జవాబు స్ఫురించింది
అనంత విశ్వంలో..
సుదీర్ఘ యానంలో
ఎన్నెన్నో జన్మల మజిలీల మధ్య
ఎక్కడో, ఎప్పుడో...
నువ్వు నాకు తారసపడే ఉంటావని
ఆ రుణబంధమే
నేటి అనుబంధమని !
                   -దీక్షిత్

Saturday, August 21, 2010

Not Simple...

It is not as simple as people say
I found it meaningful 3 words to say 
No one can ever tell

What it does really mean

it is worthy to listen with heart

When it sings a new rhyme
You became my golden mine
A true dream of mine
At that time....
I Don’t care what you will think
But I will say... I love you
Not one time or two times
Thousand times per a day
And I promise…
I won’t go any where
Even if it is end of days
It is not as simple as people say


Till Forever
You may not need me now
May be not tomorrow…
And may be not any time... 
But if ever, even just a second
You feel alone…
Remember in that moment
Till forever I will be here… 
for u only... Just 4 u only
  - DEEKSHIT…..

Friday, August 20, 2010

నివేదన

ఎందుకో...
ఈ పున్నమి రాత్రి
చందమామ చిన్నబోయింది!
ఆకాశమంత అంధకారం
రేయంతా రాజ్యమేలింది
వసంతం కాస్తా శిశిరంగా మారి
ఆశల చివుళ్ళను నిర్దాక్షిణ్యంగా
రాల్చి పారేసింది
గోదావరి తన గుసగుసలు మాని
మౌనాన్ని ఆశ్రయించింది!
చుట్టూ ఎందరున్నా...
నన్ను ఒంటరితనం ఆవహించింది
మదిలోని విచారంతో
బరువెక్కిన కాలం
ఎంతమాత్రం కదలనంటోంది
నీ వియోగం తాళలేక
నా బ్రతుకే భారంగా మారింది
ప్రియతమా !
ఎందుకీ శోధన....
అర్ధం కాలేదా నా హృదయ (ని)వేదన ?
                                  -దీక్షిత్

ఎందుకో
ఈ పున్నమి రాత్రి
చందమామ చిన్నబోయింది
ఆకాశమంత అంధకారం
రేయంతా రాజ్యమేలింది
వసంతం కాస్తా శిశిరంగా మారి
ఆశల చివుళ్ళను నిర్దాక్షిణ్యంగా
రాల్చి పారేసింది
గోదావరి తన గుసగుసలు మాని
మౌనాన్ని ఆశ్రయించింది
చుట్టూ ఎందరున్నా...
నన్ను ఒంటరితనం ఆవహించింది
మదిలోని వేదనతో
బరువెక్కిన కాలం
ఎంతమాత్రం కదలనంటోంది
నీ వియోగం తాళలేక
నా బతుకే భారంగా మారింది
ప్రియతమా !
ఎందుకీ శోధన....
అర్ధం కాలేదా నా మనో(ని)వేదన ?

Thursday, August 19, 2010

ఆ క్షణం...

నువ్వూ నేనూ
అడుగులో అడుగేసుకుంటూ...
ప్రపంచం అంచుల వరకూ
ఈ కృత్రిమత్వ కరాళ నృత్యానికి సుదూరం వరకూ
చేయి చేయి పట్టి నడిచిన
ఆ క్షణం ఎంతో బాగుంది కదూ....
ప్రకృతి ఒడిలో మనం పవళించిన రోజు
మన ఇద్దరి తనుహృదయాలు పరవశించిన రోజు
భాషకందని ఆత్మీయత మనలను ఆవహించిన రోజు
ఎల్లలెరుగని తన్మయత్వం ఆలింగనం చేసుకున్న రోజు
ఆరోజు...
ప్రియతమా... ఓహ్ ఇంకా ఎంతో బాగుంది కదూ....
నువ్వూ నేనను మాట మరచి
మనమై కలిసిమెలిసిన ఆ అపూర్వ క్షణం.....
ప్రేమకాంతి నింపిన సూర్య కిరణం
హద్దులను మసి చేసిన అగ్నికణం
మన(సు)లను ఒకటి చేసిన మధుర తరుణం
నా మజిలీ ఇదని దోవ చూపిన స్వాగత తోరణం
ప్రియతమా....
నిజంగానే ఎంతో బాగుంది కదూ...
                                        -దీక్షిత్

నీ కోసం...

రేయి ఎందుకింత సుదీర్ఘం...
హృదయమా...
క్షణమొక దినంగా... నీవు లేని దినమొక యుగంగా
భారంగా సాగుతున్న వేళ...
ఏదో క్షణంలో నీ గొంతు వినాలని,
నీ పలకరింపుతో మెరిసి మురిసిపోవాలని
నా మనసు ఆర్తిగా తపిస్తుంటే...
ఆ శుభోదయం కోసం నేను స్మరిస్తుంటే...
ఎంతకీ కదలదేం ఈ రేయి?
ధాత్రి ఇంకా రాత్రి దుప్పట్లోనే
ముసుగుతన్ని పడుకుంది
నేను మాత్రం ఈ నిశీధిలో
కునుకు కరువై  వేకువ కోసం
వేచి చూస్తున్నా...
ప్రియ సమాగమాన్ని కూర్చే
ఆ తొలి వేకువ కోసం అలాగే
వేయికళ్ళతో వేచా...
తలవాకిట తలవాల్చి నిలిచా...
కటిక నిశిరాత్రి సైతం తల వంచేలా...
నా కళ్ళే చిరుదీపాలుగా వెలిగించుకుని...
నా హృదయాధిదేవతకు దీపారాధన చేస్తూ....
అనంత విశ్వంలో
ఓ అలుపెరుగని యాత్రికునిలా
ప్రియతమా వేచిఉన్నా
నీ కోసం....
       -దీక్షిత్

Wednesday, August 18, 2010

నువ్వు కావాలి


ప్రియతమా...
చిరునవ్వులు కురిపిస్తావని...
బిగి కౌగిట బంధిస్తావని...
నులివెచ్చని ముద్దిస్తావని...
నీ ఒడిలో చోటిస్తావని...
ఎంతగానో ఆశించాను....
కానీ నువ్విలా...
కరుణ లేని రాయిలా
నన్ను వీడి వెళతావని
కలలో కూడా అనుకోలేదు... ఆ కలలో కూడా
ఈ బాధను భరించలేను
నువ్వు లేని ఈ చోటు
నాకొక నరకంలా ఉంది
నీకోసం వెదికి వేసారిన కళ్ళు
తడి ఇంకిన ఎడారి బయళ్ళు
నీ పలకరింపు కోసం
తపిస్తున్న నా హృదయం
దహిస్తున్న పెనుగాయం
నీ ఆత్మీయత
నీ అనురాగం
నీ స్పర్శలోని సాంత్వన
అన్నీ కావాలి....
నీ నవ్వు కావాలి
నీ సాన్నిధ్యం కావాలి
నాకు నువ్వు కావాలి
అవును నువ్వే కావాలి ....
                    -దీక్షిత్

Tuesday, August 17, 2010

పరిపూర్ణ వనిత

మమకార మధురిమలు పొంగు
మధుర సుధాభరిత
ఆత్మీయతకు ప్రతిరూపమైన
నిశ్చల విమల చరిత
ఎల్లలెరుగని మధురోహలకు
పొంతన కూర్చు కవిత
చిలిపిదనపు పరవళ్ళలో
కాంచవచ్చు గోదావరి తుళ్ళింత
రస హృదయాలకు లేదు చింత
ఈ పడతి నవరస భావనల సంత
పసిడి అందాల ఈ భరిణె చెంత
యువహృదయాలకు తప్పదు గిలిగింత
ఆప్యాయతానుబంధాల చందన భరిత
అందాల సిరిగంధాల పూత...
ఆత్మ సౌందర్యపు కలనేత..
నైతిక విలువల కలబోత
ఆధునికతకు ప్రతీక, స్వేచ్చకు ఎత్తిన పతాక
ఈమె ఒక పరిపూర్ణ వనిత
ఆమె పేరు.....
                                                 -దీక్షిత్