Friday, March 18, 2011

కవీ నీ పాటల్...



శంభుమహంతి రత్నకిషోర్ 
అతడి పేరు కె. సుభాష్ చంద్రబోస్, కానీ నేను సెహబాష్ చంద్రబోస్ అంటాను. అలా ఎందుకంటానంటే .... ప్లీజ్ ! లాగిన్ మై వ్యూస్.
కోట దాటి వచ్చా తోట దాటి వచ్చా కొమ్మలాగ వచ్చా కొత్త ప్రేమ తెచ్చా... సారీ వీటి తర్వాతో... ముందో ఉన్న లైన్లు గుర్తుకు రావట్లే... ట్యూన్ నడక ఎంత లయబద్ధంగా వెళ్తుందో అంతే నోవలిష్ గా సార్ రాసుకువెళ్ళారు. అన్నట్టు నిన్ననే సార్ ఇంటర్వ్యూకి లీడ్ రాశా,  ఆ.. ఇప్పుడు గుర్తొచ్చింది.. మేఘమల్లె వచ్చా మెరుపులిచ్చా.. అంటూ సూపర్ సూపర్ గా ఆయన పదాల రెండరింగ్ వెళుతుంది. ఈ మాట చాలా లేటుగా చెబుతున్నా... కానీ చాటుగా మాటుగా చెప్పట్లే ! ఎంత కొత్త స్టైల్ అది. పెరటిలోన పెంచుకున్న ముద్దబంతిలా... పెరుగులోన నంచుకున్న ఆవకాయిలా అంటూ ఆ "ముగ్ధ" మనోహర సౌందర్యాన్ని వర్ణిస్తారాయన. అన్నట్టు సింధూరం వచ్చి చాలా నాళ్ళైంది కదూ ! ఇప్పుడు గుర్తుకు రావడమేవిటో... కృష్ణవంశీ సిట్యుయేషన్కి, శ్రీ సింగింగ్ కి హండ్రెడ్ పర్సెంట్ సూట్ అయిన పాట అది. అప్పట్లో ఓ కుదుపు... అప్పటికే కాదు ఇప్పటికీ...
35నిమిషాల్లో పాట రాశాను అంటూ నీ నవ్వుల తెల్లదనాన్ని గురించి... చాలాకాలం వైట్ చేశాను అంటూ పంచదార బొమ్మ గురించీ తన అనుభవాల్ని పంచుకుంటారు. ఏం చేసినా మోడ్రన్ రెండరింగ్ ఆయనకే సొంతం. అలాగని భావుకత లేదా అంటే... అబ్బో .. కావల్సినంత....ఇతరులకు పంచాల్సినంత.... ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేయేలే.. ప్రేమలు పండే వేళ జగమంతా జాతరలే... ఇది సెట్స్ లో ఉండి రత్నం దగ్గర కూర్చుని రాసొచ్చేశారట. విశేషం ఏమిటంటే ఈ పాటకు కొరియోగ్రఫీ సుచిత్రా మేడం కావడం. ఎనీ హౌ ఆయన మాట చలివేంద్రం...ఆయన పాట చంద్రోదయం. స్త్రీలంక, వయస్కాంతం, భామచారి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఎన్నో ప్లాటినం పదాల రారాజు. బాగా గుర్తు.. అక్కినేని ఓ సందర్భంలో మౌనంగానే ఎదగమని పాట గురించి ప్రస్తావిస్తూ ఈ పాట ఈ కుర్రాడి మునిమనవల వరకూ నిలిచిపోతుందంటూ ప్రశంసించారు.  గుడుంబా శంకర్ లో లేలే.. ఇవాళే లేలే పాట గురించి చెప్పుకుంటే... బతుకుంది చావుంది చచ్చేదాక బతుకుంది చచ్చాకా బతికేలా బతకాలే అంటూ ఎంతో సూపర్బ్ గా రాశారు. ఈ మాటలు తలుచుకున్నప్పుడల్లా " చచ్చి చచ్చి బతుకుదాం/ నచ్చిన దారులు వెదుకుదాం/ చాటుగా ఊపిరి పీల్చడం... లేటుగా వెలుతురు కాల్చడం మాని చీకటి చిగుళ్ళను గతుకుదాం" అన్న శ్రీ శ్రీ మాటలు గుర్తొస్తాయి.

అంతేనా! వాలే పొద్దుని... దొరలాంటి దొంగని... చూసే పెదవిని... మాట్లాడే కనులని అంటూ చాలా భావుకత గుప్పించారు. ఈ పాట విని "సిరివెన్నెల" ఫోన్ చేసి ప్రతి లైన్ నీ చదివి వినిపించి మరీ మెచ్చుకున్నారట. అంతెందుకు నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా పాటనే వినండి. అన్ని రాగాలతోటి అల్లుకుంటాను గానీ నా పేరు రాగిణి కాదు...
నీలి మేఘాలతో ఆడుకుంటాను గానీ నా పేరు నీలిమ కాదు...భాగ్యాలు ఎన్నో నాకున్నా గానీ నాపేరు భాగ్యం కాదు అంటూ మీరా కాదు కల్పన కాదు అంటూ తన పేరు చెప్పుకోమంటూ... చాలా బాగా చమత్కరించారు. ఇది విన్న తర్వాత రచయిత కులశేఖర్ ఓ ఫోన్ ఇన్ లైవ్లో సార్ ని అభినందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో... ఏదేమైనా నాకు మహబాగా నచ్చిన పంక్తులు ప్రస్తావిస్తా... పైనా నీపైనా పడుతుంటే చీకటి వానా తేనా నే తేనా చంద్రుడ్నే గొడుగుగ తేనా అంటూ సూపర్బ్ గా చెప్పిన అన్నయ్యకి... థ్యాంక్స్ చెప్పుకుంటూ... దేవుడ్నే పిలిచావంటే రాడు రాడు ఎంతో బిజీ అన్న అన్నయ్య మరింత బిజీ కావాలని ఆశిస్తూ... ఫైవ్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ కింగ్ లాంటి శీనుగాడు .. ఫైవ్ ఫీట్ ఫోర్ ఇంచెస్ సుబ్బలక్ష్మికి పడిపోయాడు అంటూ మోడ్రనిజాన్ని... దాని మేనరిజాన్ని పతాకస్థాయిలో నిలబెట్టాలని ఆకాంక్షిస్తూ...

పీఎస్: తార తళుకు తార అన్న పాట రాస్తున్న సందర్భమది. వినయ్ (అదేనండీ వి.వి.వినాయక్) దగ్గరికి  తార తళుకు తార స్థానంలో నయనతార అని రాసుకుని వెళ్ళారట. వద్దు తళుకు తార ఉంచండి అని వినయ్ సూచన చేశారట. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి .. పాట రాసినప్పుడు కూడా ఆయనకు చిలిపిదనపు చివరి మలుపులో అన్నది మొదట తట్టలేదట. ముందో ఎక్స్ ప్రెషన్ అనుకుని ఆ తర్వాత ఇలా మార్చారట. కోవెలమూడి ప్రకాష్ ఇంట్రడ క్షన్ సందర్భంగా "అరెరె ఎవరిది అరెరె ఎవరిది అరెరె ఎవరిది తెరపైకొచ్చి మనసే దోచిన సూర్య ప్రకాశమిది" అంటూ రాసుకొచ్చారు.
ఫైనల్లీ: నేను ఇంటర్ చదువుతున్న రోజులు. సంస్కృత శబ్దం రాక ఇబ్బందులు పడుతున్న రోజులు. సాహిత్యంలో అ..ఆ.. లు కూడా తెలియని రోజులు. అలాంటి రోజుల్లో ఓ రోజు ఈనాడు పత్రికలో మంచి పాట అంటూ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పాటను, మరోసారి లక్కీలక్కీ ఎంతెంతో లక్కీ అంటూ మరో పాటనూ ప్రచురించారు. ఈ పేపర్లు అప్పట్లో నా నోట్సులకు కవర్ పేజీలు. ఇన్స్పిరేషన్లు. సో... ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టు మౌనంగా ఎదుగుతున్నా... టీని ఘనాపాటీగా తాగుతున్నా....